హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోచమ్మ ఆలయంలో అర్ధరాత్రి చోరీ

VKB: పట్టణంలోని లాలాగూడ పోచమ్మ ఆలయంలో అర్ధరాత్రి చోరీ జరిగింది. ఆలయంలో ఎవరూ లేని సమయంలో చొరబడిన దొంగలు హుండీతో పాటు వెండి సామగ్రిని ఎత్తుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ఉదయం ఆలయానికి వచ్చిన భక్తులు హుండీ కనిపించకపోవడంతో చోరీ జరిగినట్లు గుర్తించారు. ఘటనపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తూ పోలీసులు నిఘా పెంచాలని కోరుతున్నారు.