హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి'

KNR: సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామంలో మంగళవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.గ్రామస్థులకు బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ వేముల శ్రీకాంత్ మాట్లాడుతూ.. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు.