KNR: హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని 5వ వార్డులో పారిశుధ్య పనులు చేపట్టారు. రహదారుల వెంట పేరుకుపోయిన చెత్తాచెదారం, ముళ్ల పొదలు, పిచ్చి మొక్కలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. జేసీబీలు, ట్రాక్టర్లతో పరిసరాలను శుభ్రం చేశారు. వార్డులో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తూ పనులు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని కౌన్సిలర్ పరిశీలించారు.
తెలంగాణ
హుజూరాబాద్‌లో పారిశుధ్య పనులు


