హైదరాబాద్: 28°C
తెలంగాణ

డిజిటల్ సర్వేకు రైతులు సహకరించాలి: ఎంఏవో

NGKL: వంగూరు మండలంలో రైతులు డిజిటల్ క్రాఫ్ట్ సర్వేకు సహకరించి తమ పంటల వివరాలు అందజేయాలని మండల ఎంఏవో ప్రియదర్శిని మంగళవారం కోరారు. వాలంటీర్ పొలానికి వచ్చినప్పుడు రైతులు అందుబాటులో ఉండాలని విజ్ఞప్తి చేశారు. సరైన పంట వివరాలు ఇవ్వకపోతే భవిష్యత్తులో రైతు సంక్షేమ పథకాల్లో లబ్ది పొందడానికి, పంటలకు గిట్టుబాటు ధర పొందటానికి ఇబ్బందులు ఏర్పడతాయని పేర్కొన్నారు.