హైదరాబాద్: 28°C
తెలంగాణ

వరుసగా రెండో సెంచరీ బాదిన సిద్దిపేట కుర్రాడు

SDPT: అండర్-16 స్కూల్ గేమ్స్‌లో సిద్దిపేటకు చెందిన సాయి హర్షిత్‌ యాదవ్ అదరగొట్టాడు. మెదక్ ఉమ్మడి జిల్లా జట్టు కెప్టెన్‌గా జీనస్ హైస్కూల్‌తో జరిగిన మ్యాచ్‌లో 120 బంతుల్లో 185 పరుగులతో వరుసగా రెండో సెంచరీ సాధించాడు. విక్షిత్ రెడ్డి 138 పరుగులు చేయడంతో ఇద్దరూ 357 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. మెటక్ 466 పరుగులు, ప్రత్యర్థి జట్టు 50 పరుగులకు ఔట్ అయ్యింది.