హైదరాబాద్: 28°C
తెలంగాణ

తాండ్ర ఉప కేంద్రాన్ని పరిశీలించిన విద్యుత్ శాఖ సీఈ

NGKL: కల్వకుర్తి మండలంలోని తాండ్ర 33/11 కెవి ఉప కేంద్రాన్ని విద్యుత్ శాఖ సీఈ బాలస్వామి మంగళవారం పరిశీలించారు. ఉపకేంద్రం నుంచి రైతులకు అందుతున్న విద్యుత్ సరఫరా, ప్రస్తుతం నమోదవుతున్న విద్యు త్ లోడు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు మెరుగైన విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆయన వెంట జిల్లా ఎస్ఈ నరసింహారెడ్డి ఉన్నారు.