WGL: గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా WGL నగరంలో చిత్ర, విచిత్ర గణపతి విగ్రహాలు కొలువుదీరాయి. ఇందులో భాగంగా బట్టలబజార్ ప్రాంతంలో కోర్టు సెట్టింగ్‌తో ప్రత్యేకంగా న్యాయస్థానాన్ని ఏర్పాటు చేశారు. న్యాయమూర్తి రూపంలో కొలువుదీరిన గణపతి విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. వినూత్నంగా ఏర్పాటు చేసిన ఈ గణనాథుడిని చూసేందుకు భక్తులు ఆసక్తిగా తరలివస్తున్నారు.
తెలంగాణ
న్యాయమూర్తి గణపతిని చూశారా..!


