హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థులకు షూస్, స్కూల్ యూనిఫాం పంపిణీ

కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న షూస్, స్కూల్ యూనిఫాంలను మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ శ్రీమతి కాసర్ల గోదావరి స్వామి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని విద్యలో రాణించాలని సూచించారు.