హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఓటీపీ, డీమ్యాట్ వివరాలు ఇవ్వొద్దు'

HYD: సోషల్ మీడియాలో నకిలీ లైవ్ ట్రేడింగ్, గ్యారెంటీ లాభాల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారని సైబర్ క్రైమ్ పోలీసులు 'X' వేదికగా హెచ్చరించారు. అపరిచితుల మాటలు నమ్మి ఓటీపీలు, డీమ్యాట్ వివరాలు ఇవ్వొద్దని సూచించారు. సెబీ రిజిస్టర్డ్ యాప్స్‌నే ఉపయోగించాలని, మోసపోతే వెంటనే 1930కు కాల్ చేయాలని తెలిపారు.