హైదరాబాద్: 28°C
వార్తలు

'ఆ వ్యాఖ్యలు బిగ్ బాస్‌ షో వరకే పరిమితం'

తమిళ బిగ్ బాస్‌లో హోస్ట్ విజయ్ సేతుపతి వ్యాఖ్యలపై విజయ్ టీవీ యాజమాన్యం స్పందించింది. బిగ్ బాస్ తమిళ సీజన్-10 కేవలం వినోదం కోసం మాత్రమేనని తెలిపింది. 'బిగ్ బాస్ షోలో ప్రసారమయ్యే అభిప్రాయాలు, సంభాషణలు కేవలం ఆ షో పరిధికి మాత్రమే పరిమితం. వాటిని షో బయట ఉన్న ఏ వ్యక్తి, సంస్థ లేదా రాజకీయ విధానాలతోనూ ముడిపెట్టడం సరికాదు' అని విజయ్ టీవీ ఒక ప్రకటన విడుదల చేసింది.