హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీ దుగ్గిలమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు

ATP: రాయదుర్గంలో నిర్వహించిన శ్రీ దుగ్గిలమ్మ జాతర మహోత్సవం కన్నులపండువగా సాగింది. అమ్మవారిని దర్శించుకునేందుకు అనంతపురం జిల్లాతో పాటు పొరుగు ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ఆవరణ అంతా భక్తజన సందోహంతో నిండిపోయింది. భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కుబడులు చెల్లించుకున్నారు.