MBNR: జడ్చర్ల కేంద్రంలోని ఎన్‌ఎన్ నేచర్ సిటీ అయోధ్యనగర్‌లో తన నివాసం వద్ద ప్రతిష్ఠించిన గణనాథుడిని మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కాలనీ వాసులు ఆయనను శాలువాతో సత్కరించారు.
తెలంగాణ
గణనాథుడికి మాజీ ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు


