హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుమల భక్తుల కోసం ‘నందకం’ యాప్

TPT: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సమస్యలు, ఫిర్యాదులను త్వరగా పరిష్కరించేందుకు టీటీడీ ‘నందకం’ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. వసతి గదులు, కాటేజీలకు సంబంధించిన సమస్యలను భక్తులు యాప్‌ ద్వారా నేరుగా తెలియజేయవచ్చు. ఫిర్యాదులు అందిన రెండు గంటల్లోనే సమస్యలను పరిష్కరించేలా యాప్‌ను రూపొందించినట్లు సమాచారం.