హైదరాబాద్: 28°C
తెలంగాణ

విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి: బీజేపీ

HNK: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు పగడాల కాళీప్రసాద్‌గౌడ్‌ డిమాండ్ చేశారు. సోమవారం పరకాల పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రజాకారుల దాడులు, అకృత్యాలను చరిత్రలో మరువరాదన్నారు. ఆపరేషన్‌ పోలోతో హైదరాబాద్‌ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైందని తెలిపారు.