హైదరాబాద్: 28°C
వార్తలు

ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి పోటెత్తిన భక్తులు

TG: ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి భక్తులు పోటెత్తారు. గవర్నర్ దంపతులు తొలిపూజ చేయగా, మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టువస్త్రాలు సమర్పించారు. తొలిరోజు సాయంత్రంలోపే 75 వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. కేంద్రమంత్రులు, పలువురు ప్రముఖులు పూజలు నిర్వహించారు. ఈనెల 24 వరకు ఉత్సవాలు జరగనుండగా, 25న నిమజ్జనం చేయనున్నారు.