హైదరాబాద్: 28°C
వార్తలు

నేపాల్‌కు భారత్ విద్యుత్ సాయం

వరదల కారణంగా నెలకొన్న పరిస్థితులను ఎదుర్కొనేందుకు నేపాల్‌కు భారత్ విద్యుత్ సాయం అందించనుంది. నేపాల్‌కు రోజుకు 18 గంటల పాటు విద్యుత్ ఎగుమతి చేసేందుకు భారత్ అనుమతించింది. వరదలతో ప్రభావితమైన ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా, అత్యవసర అవసరాలను తీర్చేందుకు ఈ నిర్ణయం కీలకంగా మారింది. విపత్కర పరిస్థితుల్లో పొరుగు దేశానికి అండగా నిలిచిన భారత్ చర్యపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.