హైదరాబాద్: 28°C
వార్తలు

ఉగ్రవాదంపై బ్రిక్స్ వైఖరి ప్రశంసనీయం: జైశంకర్

పహల్గామ్ ఉగ్రదాడిని ఖండిస్తూ బ్రిక్స్ దేశాలు ఏకాభిప్రాయానికి రావడం ఎంతో కీలకమని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు. ఉగ్రవాదంపై అన్ని దేశాలు స్పష్టమైన, సమిష్టి వైఖరిని ప్రదర్శించడం ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని ఏ రూపంలోనూ సమర్థించరాదని, దానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం ఐక్యంగా నిలవాల్సిన అవసరం ఉందని జైశంకర్ స్పష్టం చేశారు.