హైదరాబాద్: 28°C
వార్తలు

రైలులో నిద్రపోయి స్టేషన్ మిస్ అయితే?

రైలులో నిద్రపోయి దిగాల్సిన స్టేషన్ మిస్ అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వెంటనే తదుపరి స్టేషన్‌లో దిగి TTE లేదా రైల్వే సిబ్బందిని సంప్రదించి, తిరుగు ప్రయాణానికి సరైన మార్గం తెలుసుకోవాలి. గమ్యస్థానం దాటిన తర్వాత అదే పాత టికెట్‌తో వెనక్కి ప్రయాణించవచ్చని భావించకండి. అవసరమైతే కొత్త టికెట్ తీసుకోవాలి. స్టేషన్ మిస్ అయిందని ఎమర్జెన్సీ చైన్ లాగడం మాత్రం చేయకూడదు.