హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యుత్ షాక్ బాధితునికి ఆర్థిక సాయం!

NGKL: వెల్దండ మండల కేంద్రానికి చెందిన విద్యుత్ షాక్ బాధితుడి కుటుంబానికి వెల్దండ సింగిల్ విండో చైర్మన్ జూపల్లి భాస్కర్‌రావు అండగా నిలిచారు. 15 రోజుల క్రితం విద్యుత్ షాక్‌కు గురై కల్వకుర్తిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చెదురుపల్లికి చెందిన పోలే శ్రీరాములు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. బాధితుడి వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 20,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు.