హైదరాబాద్: 28°C
తెలంగాణ

వినాయక చవితి వేడుకల్లో అపశృతి

NLG: నల్గొండ (D) తిరుమలగిరి సాగర్ (M) చింతలపాలెంలో విషాదం చోటుచేసుకుంది. గణేష్ మండపంలో పూజలు నిర్వహిస్తున్న పూజారి దత్తు ప్రసాద్ గుండెపోటుతో మృతి చెందారు. సోమవారం రవి, పున్నయ్య తమ మండపంలో ముందుగా పూజలు చేయాలని పూజారితో వాగ్వాదానికి దిగారు. అనంతరం పూజలు చేసిన ఆయన స్పృహ తప్పి పడిపోయారు. ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.