MDK: జిల్లా పోలీస్ కార్యాలయంలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రజలు భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరారు.
తెలంగాణ
పోలీస్ కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు


