GNTR: జిల్లాలో వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆయా మండలాలు, గ్రామాల్లో భక్తులు వినాయక విగ్రహాలను ప్రతిష్టించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, ముందస్తుగా వినాయక మండపాల రిజిస్ట్రేషన్లను పోలీసులు చేయించుకున్నారు. వేడుకలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని భక్తులకు అవగాహన కార్యక్రమాలను సైతం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా వినాయక చవితి వేడుకలు


