MNCL: లక్షెట్టిపేట పట్టణంతో పాటు పలు గ్రామాలలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను ఎస్ఐ గోపతి సురేష్ సందర్శించారు. ఆదివారం రాత్రి ఆయన మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులతో పాటు వివిధ గ్రామాలలో పర్యటించి వినాయక మండపాల వద్ద ఏర్పాట్లను సమీక్షించారు. వినాయక మండపాల వద్ద డిజెలు వినియోగించవద్దని నిర్వాహకులకు సూచించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
వార్తలు
వినాయక మండపాలను సందర్శించిన ఎస్సై


