హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అయినవిల్లి విఘ్నేశ్వర స్వామిని దర్శించుకున్న ఎంపీ

కోనసీమ: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న ఎంపీకి ఆలయ అధికారులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ అర్చకుల నుంచి తీర్థప్రసాదాలు స్వీకరించారు.