హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంబులెన్స్‌లో ప్రసవం

WNP: పెద్దమారూర్‌కు చెందిన అనురాధకు పురిటినొప్పులు రావడంతో 108 సిబ్బంది ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రసవం జరిగింది. మెడికల్‌ టెక్నీషియన్‌ శ్రీధర్‌ అంబులెన్స్‌లోనే సాధారణ ప్రసవం చేయగా, అనురాధ మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డను వీపనగండ్ల సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా క్షేమంగా ఉన్నారు. సిబ్బందిని కుటుంబ సభ్యులు అభినందించారు.