హైదరాబాద్: 28°C
తెలంగాణ

సఫిల్‌గూడలో నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన

MDCL: సఫిల్‌గూడ చెరువును మల్కాజ్‌గిరి ఏసీపీ సందర్శించి వినాయక విగ్రహాల నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. రద్దీ నియంత్రణ, భద్రతా చర్యలు, వివిధ శాఖల మధ్య సమన్వయంపై అధికారులతో సమీక్షించారు. నిమజ్జనం ప్రశాంతంగా, క్రమబద్ధంగా జరిగేలా తగిన ఆదేశాలు జారీ చేశారు. భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.