TPT: వినాయక చవితి సందర్భంగా సోమవారం తిరుపతి జిల్లా కలెక్టరేట్‌లో విఘ్నేశ్వరుడికి ఘనంగా పూజలు నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు భక్తిశ్రద్ధలతో పూజలు చేసి, గణనాథుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. కార్యక్రమంలో డీఐపీఆర్వో పి. గురుస్వామి శెట్టి, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కలెక్టరేట్‌లో ఘనంగా వినాయక పూజలు


