RR: షాద్‌నగర్ పట్టణ పరిధిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో ఎల్‌ఎస్‌ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ ఎదురుగా గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానికులు గమనించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం


