ASF: జైనూర్ మండలం పాట్నాపూర్ గ్రామ శివారులో అక్రమంగా సాగు చేస్తున్న గంజాయి తోటపై పోలీసులు దాడి చేసి 1,255 మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం జైనూర్‌లో మీడియా సమావేశంలో ఎస్పీ నితికా పంత్ వివరాలు వెల్లడించారు. ఈ కేసులో ఇద్దరినీ పట్టుకున్నట్లు తెలిపారు. పట్టుబడిన గంజాయి మొక్కల విలువ సుమారు రూ.1.50 కోట్లు వరకు ఉంటుందని తెలిపారు.
తెలంగాణ
గంజాయి తోటపై పోలీసుల దాడి.. ఇద్దరు అరెస్ట్


