హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణపతి పూజలో పాల్గొన్న ఎమ్మెల్సీ

RR: నందిగామ మండలం అంతిరెడ్డిగూడలో యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వర స్వామి పూజా కార్యక్రమంలో ఎమ్మెల్సీ నాగర్‌కుంట నవీన్‌రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాభావంతో ఎండిపోతున్న పాడిపంటలను కాపాడి, ప్రజలందరూ సుభిక్షంగా ఉండేలా సమృద్ధిగా వర్షాలు కురిపించాలని విఘ్నేశ్వరుడిని ప్రార్థించినట్లు తెలిపారు.