హైదరాబాద్: 28°C
తెలంగాణ

షాద్‌నగర్‌లో పనిచేయని ట్రాఫిక్ సిగ్నల్స్

RR: షాద్‌నగర్ పట్టణంలోని ప్రధాన కూడలిలో ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయడం లేదని వాహనదారులు వాపోతున్నారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు వాహనాలను మాన్యువల్‌గా నియంత్రిస్తున్నారని తెలిపారు. గణేష్ పండుగ నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీ పెరిగే అవకాశం ఉందని, సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేసేలా చర్యలు తీసుకోవాలని వాహనదారులు, ప్రజలు కోరారు.