KMR: కలెక్టరేట్‌లో జనహిత గణేష్ మండలి ఆధ్వర్యంలో సోమవారం వినాయక చవితి సందర్భంగా తొలిరోజు పూజలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.TNGO జిల్లా అధ్యక్షుడు వెంకటరెడ్డి, TGO జిల్లా కార్యదర్శి సాయిరెడ్డి తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, జిల్లా ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
కలెక్టరేట్‌లో ఘనంగా వినాయక చవితి వేడుకలు


