KNR: కార్పొరేటర్లకు ప్రజాధనంతో రూ.40 వేల విలువైన ఫోన్లు కొనుగోలు చేయడం సిగ్గుచేటని సీపీఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం ధ్వజమెత్తారు. పన్నుల రూపంలో వచ్చే సొమ్మును అభివృద్ధికి వాడకుండా దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు ఆ ఫోన్లను నగరపాలక సంస్థకు వాపస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
ప్రజాధనంతో కార్పొరేటర్లకు ఫోన్లా?: సీపీఎం


