ఢిల్లీ వేదికగా శనివారం జరిగిన బ్రిక్స్ సదస్సులో హాజరైన ప్రముఖుల కోసం విందులో పూర్తిగా శాఖాహార వంటకాలను వడ్డించారు. ఈ విందుపై ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గొయెంకా స్పందించారు. ప్రపంచంలోనే అత్యంత గొప్ప శాఖాహార వంటలు భారత్‌లో ఉన్నాయని తెలిపారు. ఇది సాధారణ శాఖాహార మెనూ కాదని చెప్పారు. ఈ విందులో పాల్గొనే అవకాశం వస్తే ఎంత బాగుండేదో అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
వార్తలు
బ్రిక్స్ సదస్సులో విందు.. స్పందించిన హర్ష్ గొయెంకా


