హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భక్తులను ఆకట్టుకున్న చిన్నారుల నృత్యాలు

CTR: కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు, వినాయక చవితి వేడుకల్లో భాగంగా ఆలయంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిన్నారుల అద్భుత ప్రతిభను వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చిన్నారులను కరతాళధ్వనులతో అభినందించారు.