హైదరాబాద్: 28°C
తెలంగాణ

వినాయక పూజల్లో పాల్గొన్న జిల్లా ఇన్‌ఛార్జ్‌ కలెక్టర్

BHNG: వినాయక చవితి సందర్భంగా భువనగిరి పట్టణంలోని ఇందిరా నగర్‌లో జరిగిన గణేష్ పూజల్లో జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ భాస్కరరావు పాల్గొన్నారు. ఈ నేపధ్యంలో గణనాథుని కృపతో జిల్లాలో సమృద్ధిగా వర్షాలు పడి పాడిపంటలతో అభివృద్ధి సాధించాలని భగవంతుని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు, మాజీ మున్సిపల్ ఛైర్మన్, తదితరులు పాల్గొన్నారు.