హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణపతి పూజలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

NGKL: హైదరాబాద్‌లోని ఫిలింనగర్ క్లబ్‌లో సోమవారం నిర్వహించిన వినాయక చవితి వేడుకల్లో కల్వకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంఛార్జ్, మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడిని పూజించి పర్యావరణాన్ని కాపాడాలని, రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించినట్లు ఆయన తెలిపారు.