హైదరాబాద్: 28°C
తెలంగాణ

వేములవాడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో వినాయకుడికి ప్రత్యేక పూజలు

SRCL: వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా వినాయకుడిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని నాయకులు, కార్యకర్తలతో కలిసి పూజలు చేశారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తూమ్ మధు పాల్గొన్నారు.