MLG: హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో సోమవారం వినాయకచవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అధికారిక నివాసంలో మట్టి గణపతిని ప్రతిష్ఠించిన మంత్రి సీతక్క కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. గణనాథుని ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు.
తెలంగాణ
ప్రజాభవన్‌లో వినాయక చవితి వేడుకలు


