MBNR: జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలోని 'సురక్ష గణపతి'కి ఎస్పీ డి.జానకి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా ప్రజలు, పోలీసు సిబ్బంది సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆమె ఆకాంక్షించారు. ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, సోదరభావంతో వినాయక చవితి వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
సురక్షగణపతికి ఎస్పీ ప్రత్యేక పూజలు


