హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: గురజాల 7వ వార్డులో సమస్యల తిష్ట

WGL: చెన్నారావుపేట మండలంలోని గురజాల గ్రామంలోని 7వ వార్డులో మౌలిక వసతుల కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలకు గల్లీ బురదమయమై నడవలేని పరిస్థితి నెలకొంది. పాఠశాల పిల్లలను పట్టుకుని తీసుకెళ్లాల్సి వస్తోంది. విద్యుత్ స్తంభాల వద్ద షాక్ ప్రమాదం పొంచి ఉండగా, చేతికి అందేలా వైర్లు వేలాడుతున్నాయి. బోరింగ్‌ నుంచి పావుగంటకు గానీ నీరు రావడం లేదని ప్రజలు తెలిపారు.