హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్మశానవాటికలో తీవ్ర నీటి కొరత

KMR: ఇందిరానగర్ స్మశానవాటికలో తీవ్ర నీటి కొరత నెలకొందని మాజీ కౌన్సిలర్ సంఘీ మోహన్ స్థానికులతో కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. అంత్యక్రియలు దశదిన కర్మలకు నీటి కోసం ప్రైవేట్ ట్యాంకర్లను ఆశ్రయించాల్సి వస్తోందన్నారు. ఒక్కో ట్యాంకర్‌కు రూ.1,000 వరకు ఖర్చవుతోందని తెలిపారు. జిల్లా కలెక్టర్ మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి నీటి సౌకర్యం కల్పించాలన్నారు.