హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: MRO

MDK: కుండపోత వర్షాల నేపథ్యంలో శిథిలమైన ఇళ్లలో నివసించే ప్రజలు తక్షణమే ఖాళీ చేయాలని చిన్న శంకరంపేట మండల తహశీల్దార్ మాలతి ఆదేశించారు. మూడ్రోజులుగా వానలు కురుస్తుండటంతో పాత ఇళ్లు కూలిపోయే ప్రమాదముందని హెచ్చరించారు. ప్రమాదకర ఇళ్ల సమాచారం అందిస్తే, బాధితులను వెంటనే సురక్షిత ప్రాంతాలకు షిఫ్ట్ చేస్తామని ఆమె స్పష్టం చేశారు.