SDPT: ఖైరతాబాద్‌లోని ప్రతిష్ఠాత్మక మహాగణపతిని సిద్దిపేట శాసనసభ్యుడు, మాజీ మంత్రి తానీరు హరీష్ రావు దర్శించుకుని స్వామివారికి వేదమంత్రాల నడుమ పూజాదికాలను నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యంతో తులతూగాలని భగవంతుడిని ఆకాంక్షించినట్లు వెల్లడించారు.
తెలంగాణ
విఘ్నేశ్వరుని వద్ద మాజీ మంత్రి పూజలు


