MDK: చిన్నశంకరంపేట మండల వ్యాప్తంగా ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు భారీ వర్షం ముసురుకుంది. సూరారం, చెన్నాయిపల్లి పరిసర గ్రామాల్లో భారీ వర్షం కురవడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో సూరారం రెడ్డి చెరువు సంపూర్ణంగా నిండి అలుగు పారుతోంది. జలకళ సంతరించుకున్న చెరువును చూడటానికి గ్రామస్తులు తరలివచ్చారు. వర్షాలు పడటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
VIDEO: అలుగు పారుతున్న చెరువు


