హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖైరతాబాద్ గణపతిని దర్శించిన తలసాని

HYD: వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్‌లోని శ్రీ పంచముఖ సంకట హర మహా గణపతిని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ నిర్వాహకులు వారిని శాలువాతో సన్మానించి, జ్ఞాపికను అందజేశారు.