హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రత్యేక పూజలు చేసిన మంత్రి

NRPT: మక్తల్ పట్టణంలో వినాయక చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. ఆచారం ప్రకారం చిన్న గణపతుల విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయాత్రగా తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొని ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.