హైదరాబాద్: 28°C
వార్తలు

'లాల్‌బాగ్ రాజా' దర్శనానికి పోటెత్తిన భక్తులు

ముంబైలోని(మహారాష్ట్ర) ప్రసిద్ధ లాల్‌బాగ్ రాజా దర్శనం కోసం భక్తులు భారీగా పోటెత్తారు. కాటన్ గ్రీన్ స్టేషన్ నుంచే క్యూలైన్లు దర్శనమిస్తున్నాయి. స్వామివారి దర్శనం కోసం భక్తులు 24 గంటలకు పైగా నిరీక్షిస్తున్నారు. ఈ ఏడాది 93వ గణేశ్ ఉత్సవాలను నిర్వాహకులు 'శివ శంకర్' థీమ్‌తో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.