హైదరాబాద్: 28°C
తెలంగాణ

ట్రాఫిక్ ఏర్పాట్లను పరిశీలించిన డీసీపీ

HYD: ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రత్యేక పూజల నేపథ్యంలో ట్రాఫిక్-1 డీసీపీ అవినాష్ కుమార్ ఖైరతాబాద్‌లో ట్రాఫిక్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. పూజల సమయంలో ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వాహనదారులు, ప్రజలకు అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.