హైదరాబాద్: 28°C
వార్తలు

బెంగాల్‌లో 252 మదర్సాల మూసివేత

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అనుమతులు లేని 252 మదర్సాలకు మూసివేత నోటీసులు జారీ చేసింది. అలాగే మరో 100 మదర్సాలకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. సరైన ధృవీకరణ పత్రాలు సమర్పించకపోతే వాటిని కూడా మూసివేస్తామని మైనారిటీ వ్యవహారాల మంత్రి ఖుదీరామ్ టుడు హెచ్చరించారు. రాష్ట్రంలో గుర్తింపు లేని మదర్సాలపై సీఎం సువేందు అధికారి ఆదేశాలతో నిర్వహించిన సర్వే ఆధారంగా సర్కార్ ఈ చర్యలు చేపట్టింది.